– ఓయు జేఏసీ పేరిట కరపత్రం చక్కర్లు
నవతెలంగాణ -ముధోల్:
బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వెంకటరమణ పై లైంగిక వేదింపుల ఆరోపణలు, ట్రిపుల్ ఐటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై త్రీవ ఆరోపణలు చేస్తు ఓయు జెఏసి పేరిట గురువారం రాత్రి సోషల్ మీడియా లో కరపత్రం చక్కర్లు కోడుతుంది. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ వీసీ పై అనేక ఆరోపణలు లేకపోలేదు . అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఘటనలు మరిచిపోకముందు, తాజాగా వీసీ పై లైంగిక వేదింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశం గామారింది. ఈ కరపత్రం ను ఆయా సోషల్ మీడియా లో విసృతంగా ప్రచారం అవుతున్నంది. దీంతో వీసీ వ్వవహార శైలి పై అనేక ఆరోపణలు రావడం విమర్శలకు తావిస్తుంది. వీసీ పై సమగ్ర దర్యాప్తు జరుపాలని కరపత్రాలో డిమాండ్ చేశారు. వీసీ పై తీవ్రమైన ఆరోపణలు రావడంతో వెంటనే దీనిపై విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావంతులు అంటున్నారు. ఈవిషయం పై ఇంచార్జి వీసీ వెంకటరమణ వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.ఏది ఏమైనా ఈవిషయం లో వీసీ స్పందిస్తారో లేదో ,వేచి చూడాలి మరి!