– తక్షణమే సస్పెండ్ చేయాలి జడ్పిటిసి పుష్పలత .
నవతెలంగాణ-బెజ్జూర్
బెజ్జూరు ఆశ్రమ పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పార్తిరాం విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని బెజ్జూర్ జెడ్పిటిసి పుష్పలత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మడవి లక్ష్మి ఆరోపించారు .శనివారం బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, విద్యార్థులను మానసికంగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను తరచూ వేధింపులకు గురి చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే సస్పెండ్ చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు .ఈ సమావేశంలోబి ఆర్ఎస్ మండల అధ్యక్షులు సకారం, ఆదివాసి జేఏసీ కార్యదర్శి కోరితే తిరుపతి ,మన్నేవారు సంఘం సలహాదారుడు మల్లేష్ పాల్గొన్నారు.