నవతెలంగాణ – డిచ్ పల్లి
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో వర్సిటీ లో ఆర్ట్స్ కళాశాల వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ సంధర్భంగా తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు జంగిలి శివ జెండాను ఎగర వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ హాజరై మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 1970 సంవత్సరంలో పురుడుపోసుకొని విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఛాంపియన్ గా పోరాటాల నిర్వహిస్తున్న ఏకైక సంఘం ఎస్ ఎఫ్ ఐ అని కొనియాడారు. ఈ 55 సంవత్సర కాలంలో అనేక అడ్డంకులు ఎదురైన విద్యార్థులనూ ఐక్యం చేసి పోరాటాలను ముందుకు తీసుకెళుతుంది అని అన్నారు. మరియు దేశం లోని ప్రఖ్యాత కలిగిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఎన్నో యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ విజయ డంక మొగిస్తుందని తెలిపారు. దేశానికి ముప్పు లాంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతున్నామని అన్నారు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పి కొడుతున్నామని ఆయన అన్నారు. స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే మూడు లక్ష్యాలను సాధించేవరకు ఉద్యమిస్తామని అని అన్నారు. నవ సమాజ నిర్మాణమే ఎస్ఎఫ్ఐ లక్ష్యమని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ విద్యా విధానంపై అడుగులు వేయాలని విద్యారంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి విద్యారంగం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.రానున్న కాలంలో యూనివర్సిటీ సమస్యల పై పోరాటాలకు సన్నద్ధం అవుతాము అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక యూనివర్సిటీ నాయకులు పృథ్వి,సంతోష్,శివ,పవన్ కళ్యాణ్,సాగర్,కిరణ్,శ్రీహరి,చరణ్,విజయ్,మహేష్,వినీత్, చక్రి, తదితర నాయకులు పాల్గొన్నారు.