– రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు
నవతెలంగాణ – బొమ్మలరామారం
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ…కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య సంక్షోభంలో ఉన్నది,గత 10 సంవత్సరాల పరిపాలించినలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువులపై చిన్న చూసిందని ఇప్పటివరకు రూ. 8200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి,కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో వచ్చి ఆరు నెలలు నడుస్తున్న ఊసు ఎత్తలేదున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నారు, కానీ 7.3 శాతం నిధులే కేటాయించారు తక్షణమే దాన్ని సవరించి, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి అన్నారు.పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ధరావత్ జగన్ నాయక్, మండల నాయకులు, వెంకటేష్, భరత్, శ్రీకాంత్ వేణు ,చరణ్ అవినాష్, శివ, సందీప్,శ్రీధర్,సునీల్,మున్న తదితరులు పాల్గొన్నారు.