
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీన నిర్వహించిన పదవ తరగతి ప్రతిభ పరీక్షలో మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ పేరుతో బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించి వారిలో ఉన్న భయాందోళన తొలగిస్తూ , వార్షిక పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించే రకంగా అభినందన సభ నిర్వహించి వారిని ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి ప్రతిభ పరీక్షను నిజామాబాద్ నగరంలో దాదాపు 1200 మంది విద్యార్థులు,23 పాఠశాలల విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు అని అందులో 30 మంది వరకు బహుమతులకు ఎంపికయ్యారని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ నరహరి మాట్లాడుతూ.. రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు భయాందోళనలు వదిలి ప్రశాంతతతో పరీక్షలు రాసి ఉత్తమ మార్కులు సాధించాలని అన్నారు అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని సృజనాత్మకతను వెలికి తీసే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. అలాగే మండల విద్యాశాఖ అధికారి రామారావు గారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రతిభా పరీక్షలు వ్యాసరచన పోటీలు క్రీడాలు లాంటివి నిర్వహిస్తూ ఒక సంపూర్ణ విద్యార్థిగా ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్దే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించడం చాలా మంచి విషయం అని కొనియాడారు. అదేవిధంగా పోరాటం ద్వారానే మార్పు సాధిస్తామని తెలియజేస్తూ రానున్న పదవ తరగతి బోర్డు పరీక్షల్లో ఉన్నత మార్కులు సాధించే రకంగా కృషి చేయాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు, గణేష్,సందీప్ నగర నాయకులు బాబురావు, ఆసిఫ్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.