సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

నవతెలంగాణ-వీణవంక
గత 25 రోజులకు పైగా జీపీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తొందని, వెంటనే ప్రభుత్వం జీపి కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో జీపీ కార్మికుల దీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారి దీక్షకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. జీపీ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోందని విమర్శించారు. జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే జీపీ కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నాయకులు, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.