
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు తీగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగ బడ్జెట్ పై తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.గత ప్రభుత్వం విద్యార్థులను విద్యకు దూరం చేసే పరిస్థితి చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడైనా విద్యారంగానికి ఈనెల 23న జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు.పాఠశాలలో ఉన్నటువంటి స్కావెంజర్ పోస్టులను అటెండర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీగుళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చిన్నకోడూరు గ్రామ శాఖ అధ్యక్షులు కిషోర్ కార్యదర్శి శివకుమార్, మణికంఠ,అభి,నరసింహ,నందు,జయంత్, సింధు,చందు పాల్గొన్నారు.