అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లను మూసివేయాలి: ఎస్ఎఫ్ఐ

– అధిక వసూళ్లపై విద్యాధికారుల చర్యలు శూన్యం 
– అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠశాల స్టోర్స్ ఎదుట డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల ధర్నా
– శ్రీ చైతన్య, మొంటోశ్రీ స్కూల్స్ ల పాఠ్యపుస్తకాలు సీజ్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠశాలలను మూసివేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గూగులోత్ శివరాజ్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్,  మొంటోశ్రీ స్కూల్స్ లలో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నా పాఠ్యపుస్తకాలను పట్టుకుని  స్టోర్స్ ముందు డివైఎఫ్ఐ ,ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యాధికారులు  అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పుస్తకాల అమ్మకాలలో బిల్లులు సక్రమంగా లేకపోవడంతో పాటు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సిరీస్ ను కాకుండా తమ స్వతహాగా ముద్రించిన శ్రీ చైతన్య స్కూల్ ,మొంటోశ్రీ స్కూల్స్ పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న స్టోర్ ను సీజ్ చేశారు. ఈసందర్భంగా డివైఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలోనీ శ్రీ చైతన్య  స్కూల్స్,మొంటోశ్రీ స్కూల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న విద్యాధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
నిబంధనలు పాటించని ఆయా స్కూల్ లను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా విద్యను  వ్యాపారమే ధ్యేయంగా ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలు చూస్తున్నాయన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో టై, బెల్టులు, స్కూలు యూనిఫామ్లు, ఎక్కడ దొరకని పాఠ్య పుస్తకాలను స్కూల్ యాజమాన్యాలు స్వతహాగా ముద్రించి ఆయా స్కూళ్లలో అమ్ముతున్నారని ఆరోపించారు. 1,వ తరగతి పాఠ్య పుస్తకాలుకు రూ . 3000  రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు.అడ్మిషన్లు ఫిజుల పేరుతో ఒక్క విద్యార్థి నుండి రూ 2000 నుంచి రూ. 5000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో పేద కుటుంబాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోలను 1,42, లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ ల పైన తనిఖీలు చేయకుండా, పాటించుకోకుండా ప్రైవేట్ స్కూల్స్లకు  తొత్తులుగా మారారని విమర్శించారు.తక్షణమే అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేయాలని లేని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ  సంఘాలు స్కూల్స్ ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజు నాయక్. నాయకులు రవీందర్, సంపత్ ,అరవింద్ ఠాకూర్,సాయి, చరణ్ తదితరులు ఉన్నారు.