– యూనివర్సిటీని ప్రకటించి, కళాశాల స్థాయిని కొనసాగించడం వలన విద్యార్థులు నష్టపోయే అవకాశం
– రానున్న అసెంబ్లీ సమావేశాలలో బిల్లు పెట్టి యూనివర్సిటీ హోదా కల్పించాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ – హైదారాబాద్
హైదరాబాద్ కోఠి మహిళా యూనివర్సిటీలో విద్యార్థులు తమ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించి, యూజీసీ గుర్తింపు ఇవ్వలేదని విద్యార్థుల ఆందోళనకు ఎస్ఎఫ్ఐ మద్దతు ప్రకటిస్తుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీని ప్రకటించి, మహిళా కళాశాల బోర్డులు మార్చి, యూనివర్సిటీని ప్రకటించింది. కానీ హాస్టల్స్, యూనివర్సిటీ గుర్తింపులు లేకుండా నడిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి హోదా కల్పించారు కానీ ఈ వర్శిటీకి పేరు మాత్రమే మార్చి, హోదా కల్పించలేదన్నారు. తక్షణమే కళాశాల స్థాయి నుండి యూజీసీ గుర్తింపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రత్యేక యూనివర్సిటీ హోదా కోసం రానున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేక తీర్మానం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల ఆందోళన దగ్గరకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని , వారి ఆందోళన విరమింపజేయాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.