
నవతెలంగాణ – హలియా
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాగార్జున్ సాగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పుస్తకాలు పట్టుకొని చదువుతూ నిరసన తెలియజేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఆకారపునరేష్ మాట్లాడుతూ హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 120 మంది ఎంపీసీ పేద మధ్యతరగతి విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందుతే నల్గొండ జిల్లా డిఐఈఓ ఈ కళాశాలలో కావాల్సిన గెస్ట్ ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ పోస్ట్ను ఇంటర్ బోర్డు కార్యాలయం కు ఖాళీ చూపించకుండా కళాశాల ప్రిన్సిపల్ పదే పదే గుర్తు చేసిన పట్టించుకోకుండా విద్యార్థులు చదువు నష్టపోవడానికి కారణమయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన మ్యాథమెటిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీని ఈ విద్యా సంవత్సరం జూన్ జూలై ,ఆగస్టు గత మూడు నెలలుగా కళాశాలకు వచ్చి సబ్జెక్టు చెప్పినప్పటికీ ఇక్కడ శాంక్షన్ పోస్ట్ లేకపోవడంతో ఆ యొక్క గెస్ట్ లెక్చరర్ కు మూడు నెలల వేతనం రాకుండా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నల్గొండ జిల్లా డిఐఈఓ అడ్మినిస్ట్రేటివ్ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగితే డిఐఈఓ గారి రూపంలో కళాశాలు నాశనం కావడానికి కంకణంకట్టుకున్నారు.హలియా కళాశాల విద్యార్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలే అన్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా హాలియా, నకిరేకల్, దేవరకొండ నార్కెట్పల్లి, మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుందని అన్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పరీక్ష ఫీజులు కట్టాలని ఈనెల 26 తేదీ పెట్టిన సందర్భంలో మరి కళాశాలలో లెక్చర్స్ లేకుండా విద్యార్థులు చదువు ఏ విధంగా ముందుకు పోతాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని దీనికి బాధ్యత వహించి తక్షణమే నల్గొండ జిల్లా ఇంటర్ బోర్డు అధికారి డిఐఈఓ తక్షణమే వీధిలో నుండి తొలగించాలని ఆయా కళాశాలలో కావాల్సిన లెక్చరర్లు ను ఇంటర్ బోర్డు తక్షణమే నియమించాలని అన్నారు. పంతాలకు పట్టింపులకు పోయి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల చదువులను రోడ్డుపాలు చేస్తే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిరంతరాయ ఉద్యమాలకు పూనుకుంటుందని అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం డిఐఈఓ కార్యాలయను ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ పేద మధ్యతరగతి విద్యార్థుల చదువుల దృష్ట స్పందించి విద్యార్థులకు కావాల్సిన లెక్చరర్లు ను నియమించాలని పేద మధ్యతరగతి విద్యార్థుల తరఫున తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం.కార్యక్రమంలో నాగార్జునసాగర్ డివిజన్ కార్యదర్శి కోరే రమేష్, వర్షిత్ నాగరాజ్ కార్తీక్ సిద్దు యశ్వంత్, చందు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.