
హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటీ శంకర్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంతో గురుకుల పాఠశాల సమస్యలు నిలయాలుగా మారాయి అని అటు విద్య ఇటు భోజనం సరిగా లేదు అని పెరుగుతున్న ధరకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచకుండా పౌష్టికాహారం ఎలా సాధ్యమన్నారు. గురుకుల పాఠశాలకు పంపే రైస్ నిత్యం పురుగుల అన్నం అనేకసార్లు అధికారులకు తెలియజేసిన అదే రైస్ ని పంపడం ద్వారా తినలేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తపరిచారున్నారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్న వివిధ టీచర్ల విద్యార్థుల ఆరోపణ పై మరియు సమస్యలపై సుదీర్ఘంగా అధికారులు చర్చించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ సి బి సి మైనార్టీ గురుకుల ల లో సమయపాలన మార్చాలని టెండర్ల పేరుతో విద్యార్థుల కు అందని పౌష్టికహారం గత మూడు నెలలుగా విద్యార్థులకు గుడ్లు లేవు, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కోరి రమేష్ వర్షిత్ చందు సాయి తదితరులు పాల్గొన్నారు.