మండలంలోని ఆరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాద్యాయుల కోరత ఉందని తెలియచేస్తు తహసీల్దార్ హిమబిందుకు మంగళవారంనాడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యమలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జుక్కల్ మండలం లోని అన్ని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల లో ఉపాధ్యాయుల మార్పిడి లో భాగంగా జుక్కల్ మండలం లోని జుక్కల్,( ఇంగ్లీష్ -4, గణితం -1, భౌతిక శాస్త్రం -1, జీవశాస్త్రం -1, హింది -1, సాంఘిక శాస్త్రం -2 ) పెద్ద ఎడ్గి ( తెలుగు -1, ఇంగ్లీష్ -1, భౌతిక శాస్త్రం -1, సాంఘిక శాస్త్రం -1, PD-1 ) ,ఖండేబలూర్, హంగార్గ్ ( గణితం -1, ఇంగ్లీష్ -1, తెలుగు -1) కౌలాస్ ( ఇంగ్లీష్ -1 ) ఖండేబాల్లూర్ ( గణితం -1, భౌతిక శాస్త్రం -1 )గాల గ్రామం లో ఉన్న జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో ఉపాధ్యాయలు లేరు అని అధికారులు చెప్తున్నారు. మంగళవారం రోజు కొంత మంది ఉపాధ్యాయలను కేటాయించరని అధికారులు చెప్పడం జరిగింది. మిగతా ఉపాధ్యాయలను కూడా కేటాయించాలి డీఎస్సీ లో నూతన ఎన్నిక అయన ఉపాధ్యాయలు రావడానికి సమయం పడుతుంది కావున అప్పటి వరకు విద్యార్థులు నష్ట పోవద్దు అని భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) డిమాండ్ చేస్తుంది, కామారెడ్డి జిల్లా లోని ఉన్న ఉపాధ్యాయలు కాకుండా ఉమ్మడి జిల్లా నుండి ఉపాధ్యాయలు ఉన్నారు కావున 371- డి, ఆర్టికల్ ను అమలు చేసి కామారెడ్డి జిల్లా లో ఖాళీ పోస్టులను ( వెబ్ సైట్) లో చూపించాలి. అప్పుడు కామారెడ్డి జిల్లా లోని నిరుద్యోగులకు ఎక్కువ అవకాశం దొరుకుతుంది అని అయన అన్నారు అప్పటి వరకు ఉపాధ్యాయ ను కొన్ని పాఠశాలలో ఒక్కో విభాగంలో ఒక్కో ఉపాధ్యాయలు ఉన్న స్థలాలాల్లో కేటాయించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జుక్కల్ మండల అధ్యక్షులు షేక్, ఫిర్దోస్, మండల కమిటీ సభ్యులు జాబిర్, అక్షయ్, సునీల్ తదితరులు పాల్గున్నారు.