టెట్ అర్హత పరీక్షా ఫీజు తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – భువనగిరి
టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు.  ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాత్రి టెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నోటిఫికేషన్ లో అర్హతకు సంబంధించిన విధివిధానాలు తెలియజేయడం జరిగినదన్నారు. కానీ పరీక్ష సంబంధించిన ఫీజు అమ్మాంతంగా పెంచడం పట్ల ఆవేదన వ్యక్తపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ పరీక్షల ఫీజు పెంచకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది మరిచి ఇప్పుడు 2011 నుండి 2017 వరకు రూ. 200 ఉండేది. 2022లో రూ 300గా నిర్ణయం చేయబడినదన్నారి. 2023 సెప్టెంబర్లో నిర్వహించిన పరీక్షకు రూ .400 తీసుకున్నారని తెలిపారు. ఒక పేపర్ రాసిన రెండు పేపర్లు రాసిన రూ.400 కంటే ఎక్కువ మించలేదన్నారు. ఇప్పుడురూ రూ.1000 కు పెంచడం బాధాకరమన్నారు. ఒక పేపర్ కు వెయ్యి రెండు పేపర్లు రాస్తే రూ.2000 వేలకు చేశారన్నారు. పోటీ పరీక్షల ఫీజు పెంచమని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర ఫీజులు వసూలు చేయడం అంటే మోసం చేసినట్టే అని అన్నారు. పెంచిన టెట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని  కోరారు.