ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి: ఎస్ఎఫ్ఐ వేముల నాగరాజు

నవతెలంగాణ – వలిగొండ రూరల్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలోని వలిగొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని బాలికల వసతి గృహం లోనీ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ బుధవారం సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల పర్యవేక్షణ నిర్వహించని ఎస్ ఓ సస్పెండ్ చేయాలన్నారు. హాస్టల్లో 110 మంది విద్యార్థులు ఉంటే 10 కిలోల చికెన్  సరిపెట్టడం సరైంది కాదని వారు విమర్శించారు. అదేవిధంగా హాస్టల్లో కరెంటు సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అన్నారు. హాస్టల్లో విద్యార్థులకు ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే అక్కడ పట్టించుకోనికి వార్డెన్ లేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఎదురవుతుందన్నారు. వెంటనే  హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్ట్ భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా హాస్టల్లోకి పాములు, తేళ్లు రావడంతో విద్యార్థులు భయాందోళన గురవుతున్నారని వెంటనే అక్కడున్న ప్రాంతాన్ని శుభ్రపరిచి విద్యార్థులు భయాందోళనకు గురవకుండా చూడాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన పాలు అందించకుండా హాస్టల్లోకి కల్తీ ప్యాకెట్ పాలను తీసుకొచ్చి పబ్బం గడుపుతున్న పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. అదేవిధంగా హాస్టల్లో ప్రధానమైన సమస్య ఆడపిల్లలకు వాష్ రూమ్ డోర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే ప్రస్తుతం హాస్టల్లో ఉన్న బాత్రూంలకి అన్ని డోర్లు ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే డీఈఓ  స్పందించి  హాస్టల్ ని సందర్శించి విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకొని పర్యవేక్షణ లోపంగా వ్యవహరిస్తున్న ఎస్ఓ సస్పెండ్ చేయాలన్నారు. ప్రభుత్వం చాలీచాలని పైసలతో సంక్షేమ హాస్టల్ అభివృద్ధి చేయడం ఎలా అని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్, నాయకులు ఏసోఫ్,వినయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.