– విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి..
– ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్..
నవతెలంగాణ – వేములవాడ
నవతెలంగాణ – వేములవాడ
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ వేములవాడ పట్టణ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, పట్టణ అధ్యక్షుడిగా సాయి భరత్, కార్యదర్శిగా శివ ఉపాధ్యక్షులుగా ఆర్ శివ, సహాయ కార్యదర్శిలు సాయి అనురాగ్ శివరామకృష్ణ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు, నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నుకున్నటువంటి నూతన కమిటీ వేములవాడ నియోజక పరిధిలో విద్యారంగ సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని దిశ నిర్దేశం చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్ని గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టౌన్ అధ్యక్ష కార్యదర్శులు సాయి భరత్, శివ లు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి టౌన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకున్నందుకు జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎఫ్ఐ గా విద్యార్థుల సంక్షేమ కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు.