నవతెలంగాణ – పెద్దవంగర
ఎస్‌జీఎఫ్ మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎంపికలు ఈ నెల 26 నిర్వహించినట్లు ఎంఎన్ఓ బుధారపు శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ కంచర్ల ప్రభాకర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ ఎంపిక పోటీలు జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్-14, 17 బాల బాలికలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో అవుతాపురం ఫిజికల్ డైరెక్టర్ సురేందర్, ఉపాధ్యాయులు రాజలింగం, కరుణాకర్, శ్రీధర్, కవి రాజు తదితరులు పాల్గొన్నారు.