ఎస్జీటీ లను వెంటనే రిలీవ్ చేయాలి 

– టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సతీష్
నవతెలంగాణ-పెద్దవంగర: బదిలీ అయిన ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే రిలీవ్ చేయాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయ బదిలీ చేసినా, కూడా వారిని రిలీవ్ చేయకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాద్యాయులు బదిలీ అయిన రిలీవ్ కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నారు. డీఎస్సీ నియామకాలు చేపట్టేంతవరకు వేచి చూడకుండా, ప్రభుత్వం తక్షణమే విద్యా వాలంటీర్లను నియమించి, ఎస్జీటీలను రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు.