బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన షబ్బీర్ అలీ

నవతెలంగాణ – కంటేశ్వర్
హైదరాబాద్ సెక్రటేరియట్ లో షబ్బీర్ అలీ ఛాంబర్ లో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఇందులో శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 82 బీసీ సంక్షేమ హాస్టల్ భవనాల గురించి 500 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ కమీషనర్ బాల మాయదేవి, బీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్,బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.