చెక్కుల పంపిణీ చేసిన షబ్బీర్ అలీ..

Shabbir Ali distributed the cheques.నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్అలీ  కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ఎఫ్ ఫైళ్లను ముఖ్యమంత్రితో మాట్లాడి, కామారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం దాదాపు 150 మందికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించి చెక్కులను అందించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఊరట కలిగిస్తాయి అన్నారు. మేము బేశ జాలాలకు వెళ్ళమని  పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గం ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతోపాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.