కామారెడ్డి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి ప్రత్యేకతలు మంజూరు చేయించినందుకు గాను శనివారం రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ చిత్రపటాలకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయావరణంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డమీద చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రత్యేక నిధులు కేటాయించి కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతూ నిధులు అందిస్తున్నారన్నారు. రూ.27 కోట్లను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సీఎంతో మాట్లాడి మంజూరు చేయించారు అని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఊర్దూండ వనిత రవి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.