
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి కుమారుడు, గిరెడ్డి అనిరుద్ రెడ్డి వివాహానికి బుధవారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, దోమకొండ జెడ్పిటిసి తిరుమల గౌడ్ తో కలిసి హైదరాబాదులోని పటాన్చెరువు ఫంక్షన్ హాల్ లో వేడుకల్లో పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నా రెడ్డి మోహన్ రెడ్డి, గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నా రెడ్డి రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.