షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సాదీ ముబారక్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పేద వారికి అడ పిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని, ప్రతి పేదవాడు ప్రభుత్వ పథకాలు లబ్దిపొందలేని తెలిపారు. ప్రభుత్వాలు మారిన పథకాలు అగవని, పథకాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వకుడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 19 సా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డి. విఠల్ రావు, స్థానిక ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ క్రాంతి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.