వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. మేకర్స్ మంగళవారం ఈ సినిమా నుంచి ‘శకుంతలక్కయ్యా..’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ ఎనర్జిటిక్ పార్టీ బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ మాస్‌ని ఆకట్టుకుంటున్నాయి. సింగర్ ఉమా నేహా పవర్‌ఫుల్ వోకల్స్ మరింత ఎనర్జీని తీసుకొచ్చాయి. ఈ సాంగ్‌లో మాస్ డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. పెర్ఫెక్ట్ పార్టీ సాంగ్‌గా అలరించిన ఈ పాట ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ‘క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయం సాధించిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.