– క్వార్టర్‌ఫైనల్లో బెంగాల్
బెంగళూర్ : స్టార్ పేసర్ మహ్మద్ షమి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకుని బెంగాల్ తరఫున దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీలో ఆడుతున్న మహ్మద్ షమి ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో చెలరేగాడు. బెంగాల్ తరఫున నం.10 బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన షమి 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 17 బంతుల్లోనే 32 పరుగులు పిండుకున్నాడు. కరణ్ లాల్ (33), చటర్జీ (28), ప్రదీప్ (30) సైతం రాణించటంతో చంఢగీఢ్‌తో మ్యాచ్‌లో తొలుత బెంగాల్ 20 ఓవర్లలో 159/9 పరుగులు చేసింది. ఛేదనలో చంఢగీడ్ మెరిసినా.. 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సయాన్ ఘోష్ (4/30), మహ్మద్ షమి (1/25) రాణించటంతో చంఢగీడ్ 20 ఓవర్లలో 156/9 పరుగులే చేసింది. చంఢగీడ్ తరఫున మనన్ వోహ్రా (23), రజ్ బవ (32), పర్దీప్ (27), నిఖిల్ (22) రాణించారు.