శంకర్‌కు మెగా ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో నంది పురస్కారం

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త వేల్పుల శంకర్‌కు ఆదివారం హైద్రాబాద్‌లోని బిర్లా భాస్కర ఆడిటోరియంలో మెగా ఎంటర్‌ ప్రైజెస్‌ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి, నంది పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా సమయంలో తన ద్విచక్ర వాహనంపై ప్లెక్సిలు ఏర్పాటు చేసి పలు గ్రామాలలో అవగాహన కల్పించడం పట్ల ఈ పురస్కారాన్ని అందించినట్లు తెలిపారు. అలాగే పలు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాస్క్‌లు, షానిటైజర్‌లు, స్టాండ్‌లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల బాధ్యత మరింత రెట్టింపుగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశాల శ్రావణ్‌రెడ్డి, శిశు సంక్షేమ శాఖ మెంబర్‌ రవి శివతేజ, అనుప్రసాద్‌, భాస్కర్‌, కిరణ్‌, మధుబాబు, రుద్ర శ్రీనివాస్‌, శశి, ప్రణయ్‌కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గాయకులు కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.