నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్: బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి సోమవారం బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా సోమవారం బీఫామ్ అందుకున్నారు.ఈ సందర్భంగా ఆందోజు శంకరాచారి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ బహుజనుల బిడ్డగా ఏనుగు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ పల్లె లింగస్వామి,మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఏర్పుల అర్జున్,బిఎస్పి రాష్ట్ర నాయకులు ఐతరాజు అంబేద్కర్,చౌటుప్పల్ బీఎస్పీ మండల అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్,నాంపల్లి మండల అధ్యక్షులు పల్లెటి వినోద్ తదితరులు పాల్గొన్నారు