శంకరన్న విజయం ఖాయం

– కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు సంక్షేమం
– ఇంటింటి ప్రచారంలో మండల అధ్యక్షులు గూడ వీరేశం
నవతెలంగాణ-కేశంపేట
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకరన్న విజయం ఖాయమని కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గూడ వీరేశం ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని బొదునంపల్లి, లేమామిడి, తుర్కలపల్లి, గాంధీ శంకర్‌ పల్లి, నిర్దవెళ్లి, శ్యాంరావుతాండలలో ఆయా గ్రామాల గ్రామ కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు రెండుసార్లు అవకాశం కల్పించారని కానీ గద్దెనెక్కిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో గ్రామాలను అభివద్ధి పరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల నమ్మకాన్ని మంటగలిపి నేడు ఓట్లు అడుగుతున్న బీఆర్‌ఎస్‌ నేతలకు ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే బడుగు,బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కాయని వివరించారు. ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా 6గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఓటర్లకు తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌ రెడ్డి,శ్రావణ్‌ రెడ్డి,తుమ్మల గోపాల్‌ ముదిరాజ్‌, గిరి యాదవ్‌,భాస్కర్‌ గౌడ్‌,రుప్లానాయక్‌, బాలాజీ, పాండు, బాలకష్ణ య్య, నరసింహ, ప్రకాష్‌, అశోక్‌, యాదయ్య, ఆంజనేయులు, మల్లయ్య, వివిధ గ్రామాల చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.