ఉపాధ్యాయుల పదోన్నతులలో కామ్ స్కానింగ్ స్కాం జరిగిందనడానికి బయటకు వస్తున్న అక్రమాలు, సరిదిద్దే ప్రయత్నంలో అనేక మోడిఫికేషన్స్ డిఈఒ ను తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఆదేశించాలి అని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతన్ తెలియజేశారు. ఇటీవల స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులలో డైరెక్టరేట్ కార్యాలయం నుండి పంపించిన పదోన్నతుల జాబితాలను కామ్ స్కాన్ ద్వారా జిల్లా విద్యాశాఖ ఎడిట్ చేసి అక్రమాలకు పాల్పడిన విషయం గత వారం దిన పత్రికలలో పతాక శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ స్కామ్ వల్ల సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. వీరికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయిన పాఠశాలలను జూనియర్లకు మోడిఫికేషన్ చేయడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులు తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతా ధికారులకు ఫిర్యాదులు చేయగా, జిల్లా విద్యాశాఖ చేసిన అక్రమాలను (స్కామ్) కప్పిపుచ్చుకునేందుకు ఫిర్యాదులు చేసిన ఉపాధ్యాయులను బుజ్జగించే పనిలో పడి ఒక్కొక్కరిని డీఈఓ ఆఫీస్ కు పిలిపించుకొని అనధికార వ్యక్తులతో కౌన్సిలింగ్ ఇప్పించడం అలాట్ పాఠశాలలో జైన్ కావాలని ఒత్తిడీలు చేయడం ద్వారా కొంతమంది చేసేదేమీ లేక అయిష్టంగానే తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేక జాయిన్ అయిపోయినారు. కానీ మరికొందరు తమకు జరిగిన అన్యాయంపై న్యాయం జరగాలని తనకు అలాట్ అయిన పాఠశాల ఫిలప్ అయివున్నందున బాధితులకు అనుకూలమైన పాఠశాలలను (కోరుకున్న చోటు) బదిలీ చేసిన వ్యవహారం ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీనిని బట్టి కామ్ స్కానింగ్ స్కాం జరిగిందనడానికి బలమైన ఆధారాలు లభించినట్లు అయింది. అనేకంగా అక్రమ మోడిఫికేషన్లు జరిపిన వాటిలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం. సోషల్ స్టడీ సబ్జెక్టులో లోకల్ బాడీ తెలుగు మీడియంలో 18 రోస్టర్ పాయింట్ లో ఉన్న ఉపాధ్యాయుడు కి అలాట్ అయిన పాఠశాలను మార్చడం వల్ల తను కోరుకొనని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పేరుతో మరో పాఠశాల జెడ్పిఎస్ఎస్ ఏర్గట్ల అలాటైంది.
మొత్తం 80 పదోన్నతులు ఇస్తే 18 వ రోస్టర్ పై కోరుకున్నది ఎలా దక్కదు? ప్రస్తుతం ఆయనకు జరిగిన అన్యాయంపై పాఠశాల డైరెక్టర్ కు చేసిన ఫిర్యాదుతో జిల్లా విద్యాశాఖ అధికారి అతనికి కేటాయించబడ్డ జడ్పీహెచ్ఎస్ ఏర్గట్లను మోడిఫికేషన్ చేస్తూ మరొక్క పాఠశాల యుపిఎస్ గాంధీనగర్ జక్రాన్ పల్లి మండలానికి ఉత్తర్వులు ఇవ్వడంతో ఈనెల 4న అక్కడ జాయిన్ కావడం జరిగింది.( వి. హరిజీవన్.) ఫలితంగ. ఈ పాఠశాలలో విద్యార్థులు లేరని ఆరు ఏడు తరగతులలో విద్యార్థుల సంఖ్య జీరో కావడంతో ఈ పాఠశాలను బ్లాక్లో లిస్టులో ఉంచడం జరిగింది. వన్ టు ఫిఫ్త్ 18 విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఒక ఎస్జీటీ రెండు పండితులు పనిచేస్తున్నారు. మొత్తం ఐదుగురు పనిచేస్తున్నరు. బ్లాక్ లో ఉన్న ఖాళీని డీఈఓ ఓపెన్ చేసి ఇవ్వడం బట్టి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలా బ్లాక్ పాఠశాలను ఓపెన్ చేయడానికి డైరెక్టర్ అనుమతి ఉండాలి. కావున విద్యార్థులు లేని పాఠశాలకు పోస్టు ఓపెన్ చేసే అవకాశమే లేదు. అంటే డిఇఓ ఉన్నతాధికారుల అధికారాలను సైతం తానే ఉపయోగిస్తున్నట్లు అర్థమవుతుంది. ఫలితంగా జడ్పీఎస్ స్ ఎర్గట్లలో పదోన్నతులలో వచ్చిన మరొకరు కూడా మాడిఫికేషన్ ద్వారా జైన్ కాకపోవడంతో ఇక్కడ 275 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు కూడా లేని దుస్థితి ఏర్గట్ల పాఠశాల ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా గణితశాస్త్రంలో మరో ఉపాధ్యాయుడు రోస్టర్ 32 వద్ద తనకు (పి. మురళీ) రావలసిన జెడ్పిహెచ్ఎస్ పల్లికొండ పాఠశాలను తన తర్వాతి రోస్టర్ 34 కు ఎలా కేటాయించారని, (ఇతనికి కేటాయించబడింది జడ్పీహెచ్ఎస్ చీమన్ పల్లి తనకు జరిగిన అన్యాయాన్ని పాఠశాల డైరెక్టర్కు ఫిర్యాదులు చేసి 15 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తానికి తను కోల్పోయిన పల్లికొండ పాఠశాలను కాకుండా భీమ్ గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పోస్టింగును పొందగలిగాడు. ఈ పాఠశాల కూడా బ్లాక్ లిస్టులో ఉన్నది. అంటే జిల్లా విద్యాశాఖ అధికారి తనకుండబడే పరిమిత అధికారాలను పక్కనపెట్టి పాఠశాల డైరెక్టర్ గారికి ఉండబడే అధికారాలను కూడా తానే స్వాధీనం చేసుకుని, నిబంధనలు అతిక్రమించి అక్రమ పోస్టింగులు ఇవ్వడం పట్ల డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. కామ్ స్కానింగ్ స్కాం జరిగిందనడానికి గత 20 రోజులుగా జిల్లాలో జరుగుతున్న మోడిఫికేషన్లు, సీనియర్లకు అన్యాయం, జూనియర్లకు దొడ్డిదారి లాభాలు (ప్రాముఖ్యత పాఠశాలల అలాట్) జరిగినట్లుగా అనేక ఆధారాలు బయటపడుతున్నందున, జిల్లా విద్యాశాఖ అధికారి ని తక్షణమే సస్పెండ్ చేసి వెబ్ ఆప్షన్ జాబితాలు కామ్ స్కాన్ ఎడిటింగ్ కు సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశించాలని, కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ గారికి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. తేదీ 01.7.2024 న కమిషనర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కు 5 పేజీల ఫిర్యాదు పత్రాన్ని అందించిన వాటిలో ముఖ్యమైనవి ఒక పోస్టు ఉన్న పాఠశాలకు ఇద్దరేసీ ఉపాధ్యాయులను కేటాయించడం, రెండుసార్లు నాటు విల్లి oగ్ ఇచ్చిన వారికి పదోన్నతులు కల్పించడం, 74 పదోన్నతులు ఇవ్వవలసి ఉండగా, 80 మందికి పదోన్నతులు ఇవ్వడం, ఎస్సీ రోస్టర్ పాయింట్లు విస్మరించడం, రోస్టర్ నంబర్లు క్రమ పద్ధతిలో లేకపోవడం, సీనియారిటీ జాబితాలో లేని వారికి సైతం పదోన్నతి, వేకెన్సీ లో రెండు పోస్టులు ఉన్న పాఠశాల నుండి వెబ్ కౌన్సిలింగ్ అనంతరం అందులో ఒకరిని తొలగించి మరోచోటికి ఇవ్వడం, పదోన్నతికి సంబంధం లేని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పదాన్ని జాబితాలో చేర్చడం ఎంఈ వోలు హెడ్మాస్టర్లు ఒక్కో ఉపాధ్యాయునికి రెండు పాఠశాలలకు రీలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వడం భిన్న సంఖ్యతో ఒక సబ్జెక్టులో రెండు జాబితాలు వెలువరించడం, 2000 డీఎస్సీ ఉపాధ్యాయులను విస్మరించి 2002 డీఎస్సీ వారికి ఓపెన్ లో పదోన్నతి కల్పించడం , మొదలైన అక్రమాలు ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అని తెలియజేశారు.