సింగపూర్ : భారత టేబుల్ టెన్నిస్ వెటరన్ ఆటగాడు అచంట శరత్ కమల్ సింగపూర్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో 11-4, 11-8, 12-10తో ఈజిప్ట్ ఆటగాడు ఓమర్ అస్సార్‌ను చిత్తు చేసిన శరత్ కమల్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్లో వరల్డ్ నం.13 డార్కోను ఓడించిన కమల్.. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఫెలిక్స్ లెబ్రున్, స్వీడన్ ఆటగాడు క్రిస్టియన్‌లో ఒకరితో తలపడనున్నాడు.