మీ భావాల‌ను పంచుకోండి

Share your feelingsమన గురించి మనం ఆలోచించుకోవడమంటే సెల్‌ఫిష్‌నెస్‌ అనుకుంటారు చాలా మంది మహిళలు. అలా ఆలోచించడమంటే ఏదో పెద్ద తప్పు చేసేసిన్నట్టు విపరీతంగా ఫీలైపోతుంటారు. అయితే మన గురించి, మన ఆనందం గురించి, మన ఆరోగ్యం గురించి పట్టించుకుంటేనే మన కుటుంబం బాగుంటుందనే చిన్న విషయాన్ని గుర్తించరు. మీరు ఆనందంగా ఉంటేనే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుర్తించినప్పుడు మహిళలు తమ గురించి తాము పట్టించుకుంటారు. ఈ విషయాల గురించి ఈ రోజు మన ఉమెన్‌ హెల్త్‌లో మాట్లాడుకుందాం…
మహిళల విషయంలో సెల్ఫ్‌లవ్‌, సెల్ఫ్‌ కేర్‌, సెల్ఫ్‌ అవేర్‌నెస్‌ అనే ఈ మూడు ఎమోషన్స్‌ వెల్‌బీయింగ్‌ కొరకు, సంపూర్ణ ఆరోగ్యం కొరకు అత్యంత ముఖ్యమైన అంశాలు. సర్వసాధారణంగా స్త్రీల విషయంలో, నిజ జీవితంలో సెల్ఫ్‌ లవ్‌ని, సెల్ఫ్‌ కేర్‌ని సెల్ఫిష్‌నెస్‌తో కన్‌ఫ్యూస్‌ అవుతూ ఉంటారు. తమ గురించి కేర్‌ తీసుకోవడానికి, తమకు ఇష్టమైన పనులు చేయడానికి, ఆనందం పొందడానికి మహిళలు గిల్టీ ఫీల్‌ అవుతుంటారు. ఈ ఆలోచనా విధానం చాలా తప్పు. ఇది మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. మనకు నచ్చిన, మనకు అవసరమైన విషయాలపైన దృష్టిపెట్టడం, వాటి కోసం సమయం వెచ్చించడం అతి ముఖ్యమైన, అత్యవసరమైన అంశం. మన సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఇది చాలా అవసరమని గుర్తుపెట్టుకోవాలి.
ధైర్యంగా చెప్పండి
ప్రతి దానికి ఒక సున్నితనమైన boundary ఉంటుంది. ఆ boundaries ని అర్థం చేసుకోని ఇతరులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేకుండా కేవలం మన Well being కొరకు మన Self love and Self Care practise చేయాలి. ఇది అంత సులువైన విషయం కాదని నేను పూర్తిగా అంగీకరిస్తాను. కానీ మనం చిన్న చిన్న అడుగులు వేస్తూ సున్నితమైన(Gentle), గంభీరమైన (Firm) కంఠంతో మన ఉద్దేశాలను, మన మనసులోని మాటలను స్పష్టంగా వ్యక్తపరుస్తూ ధైర్యంగా అడుగులు వేస్తూ మన ఆరోగ్యం కొరకు, మన కుటుంబ ఆరోగ్యం కొరకు సెల్ఫ్‌ లవ్‌, సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయడం ఎంతో అవసరం.
అంచనాలు ఎక్కువ
ఉదాహరణల ద్వారా ఈ అంశాలను మరింత స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోవచ్చు. మన సంస్కృతిలో స్త్రీలను, ముఖ్యంగా మాతృమూర్తులను ఎంతో ఉన్నతంగా చూస్తూ ఉంటారు. అయితే ఈ ఉన్నతంగా చూడటంతో పాటు ఎన్నో బరువు, బాధ్యతలు, అంచనాలు కూడా వారిపై రుద్దబడుతున్నాయి. ఎంత చేసినా ఇంకా ఆశిస్తూనే ఉంటారు. వారి ఎన్నో త్యాగాలు చేయాలని ఆశిస్తుంటారు. వారు నిరంతరం విశ్రాంతి లేకుండా పని చేస్తున్నా దానికి సరైన గుర్తింపు కూడా ఉండదు.
అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే
నేను చెప్పదలచుకుంది ఏమిటంటే స్త్రీలను దేవతలుగా పూజించనక్కర్లేదు. నీచంగా చూడనక్కర్లేదు. వారిని తోటి మానవులుగా చూడడం, వారి అవసరాలను గుర్తించడం ముఖ్యం. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. నేను నా ప్రాక్టీస్‌లో చాలామందిని గమనించాను. చాలా మంది జంటల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. వారు వారి ఆరోగ్యానికి అసలు ప్రాముఖ్యం ఇవ్వరు. కుటుంబ ఆరోగ్యమే తమ ఆరోగ్యంగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి స్త్రీ అనగా అమ్మ ఆరోగ్యమే కుటుంబాన్ని మొత్తం ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది.
ప్రాక్టీస్‌ మొదలుపెట్టండి
ఇది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను నా చిన్నతనంలో మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. మా అమ్మ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడడం స్వయంగా చూశాను. అసలు విషయం ఏమిటంటే సెల్ఫ్‌ లవ్‌, సెల్ఫ్‌ కేర్‌ – సెల్ఫిష్‌నెస్‌ ఒకటి కాదు. దీన్ని సరిగా అర్థం చేసుకొని ప్రాక్టీస్‌ చేయడం మొదలు పెట్టండి. మీ భావాలకు, ఆలోచనలకు, ఆరోగ్యానికి ప్రాముఖ్యం ఇవ్వడం మొదలుపెట్టండి. మీ ఆలోచనలను, అవసరాలను స్పష్టంగా భయం లేకుండా మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చెప్పండి. ముఖ్యంగా మీ భాగస్వాములకు. Gentle, Firm భాషలో పంచుకోండి. ఇక సెలవా మరి..! మీ holistic well being కి అతి ముఖ్యమైన సెల్ఫ్‌ లవ్‌, సెల్ఫ్‌ కేర్‌, సెల్ఫ్‌ అవేర్‌నెస్‌ అనే ఈ triad ని మరిచిపోకండి.

Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314