న్యూఢిల్లీ : సౌదీ అరామ్‌కో ఛైర్మన్ యాసిర్ ఒత్మాన్ హెచ్ అల్ రుమయ్యన్‌ను రిలయన్స్ ఇండిస్టీస్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా పునర్నియమించడాన్ని 16 శాతం మంది వాటాదారులు వ్యతిరేకించారు. అయితే.. మెజారిటీ ఇన్వెస్టర్లు 83.97 శాతం మద్దతు పలకడంతో ఐదేళ్ల పాటు కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ పిఎంఎస్ ప్రసాద్‌ను మరో ఐదేళ్ల పాటు డైరెక్టర్‌గా మళ్లీ నియమించేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. యాసిర్‌కు బోర్డ్ లేదా కమిటీల సమావేశాలకు హాజరైనందుకు రుసుము, ఇతర సమావేశాలలో పాల్గొనడానికి అయ్యే ఖర్చుల రీయింబర్స్‌మెంట్, లాభానికి సంబంధించిన కమీషన్ ద్వారా రెమ్యునరేషన్ చెల్లించనుంది.