నవతెలంగాణ పెద్దవంగర: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెరుకు నర్సమ్మ (84) వృద్ధాప్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి మృతురాలి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు చెరుకు యాకయ్య, చిలుక రజిత, చెరుకు యాకయ్య, చెరుకు ఎల్లయ్య, బంగారు వెంకన్న, గణపురం సోమయ్య, చిలుక బిక్షం తదితరులు పాల్గొన్నారు.