శర్వా .. పెళ్ళి సందడి మొదలైంది

హీరో శర్వానంద్‌ పెళ్ళి సందడి మొదలైంది. రక్షితతో ఆయన వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌ లీలా ప్యాలెస్‌లో జూన్‌ 3న అంగరంగవైభవంగా జరుగనుంది.
జూన్‌ 2న మెహందీ ఫంక్షన్‌, మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్‌ని వేడుకగా చేయబోతున్నారు.
అదే రోజు వివాహ మహౌత్సవం రాత్రి 11 నుండి ప్రారంభమవు తుంది. శర్వానంద్‌, రక్షితల నిశ్చితార్థం జనవరిలో జరిగిన విషయం విదితమే.
హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వీళ్ళిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.