ఆమె

ఆమెఆమె ఆశ నిరాశలమధ్య వారధి
ఆశయ సాధనలో అలుపెరుగనిపోరాటసారధి అయినా పతి తరువాతే పత్ని
అంటుంది ఈ జన వాహిని
కన్న కలల కోసం కష్టాల తిమిరా లను దాటి
కష్టాలనే ఇష్టాలుగా తనలో కలిపేసుకునీ
విజయ సౌదాల వైపు పయనమవుతుంది ఆమె
కన్న కలలు కళ్ళలైతే కలత చెందే ధరణి ఆమె
కుటుంబ కలహాలోస్తే కన్నీళ్లతో నిత్య సహవాసం చేసేది ఆమె
ఆ కుటుంబానికి నిత్య వెలుగరు
కాసేది ఆమె
అత్త మామలతో అవాకులు చావాకులు పడేది ఆమె
అందరికి అమ్మరు లాలించేది ఆమె
రోడ్డు పై అడుగేస్తే మగాల చూపుల
భానాలకు బలయ్యేది ఆమె
ఎదురు తిరిగితే ఇనుప కత్తుల గాట్లకు బలయ్యేది ఆమే
అయినా ఆత్మ రక్షణ కోసం నిత్యం పోరాడేది ఆమె
ఇదేనా మన సమాజపు పురోగతి
ఇంకెప్పటికీ తెలుసుకోలేకపోతె అదోగతి
– మేరెడ్డి రేఖ,7396125909