గొర్లు, మేకల పెంపకందార్లు ఆర్థికంగా ఎదగాలీ..

– పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటేష్..

 నవతెలంగాణ – జుక్కల్
గొర్లు, మేకల పెంపకం దార్లు ఆర్థికంగా ఎదగాలని మద్నూర్ పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటేశ్, జుక్కల్ ఇంచార్జీ పశువైద్యాదికారి బండివార్ విజయ్ అన్నారు. బుదువారం రోజు మండలంలోని హంగర్గ గ్రామములో గ్రామ సర్పంచ్ బాలమణి హన్మండ్లు ఆధ్వర్యంలో నిర్వహించిన రాయితీ గోర్ల ను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణి చేసారు. ఈ సంధర్భంగా ఏడి వెంకటేష్ మాట్లాడుతు గొల్ల, కుర్మ కులస్తులకు  తెలంగాణ ప్రభూత్వం ద్వారా రాయితీ పైన ఆరు యూనిట్ల గోర్లు పంపిణి చేసామని, ఎక్కడా లేని విధంగా అందరితో సమానంగా ఎదగాలని రాష్ట్ర ప్రభూత్వం కృషి చేస్తోందని, పంపిణివచేసిన గోర్లను ఎవ్వరు అమ్ముకోవద్దని, గొర్ల సంతతి పెరిగే విధంగా కృషి చేయాలని రాయితీ పొందిన లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్,  పశు సంవర్ధక శాఖ అధికారులు, గొల్ల, కుర్మలు , నాయకుడు హన్మండ్లు తదితరులు పాల్గోన్నారు.