నవతెలంగాణ – ఆర్మూర్
గత కొన్ని నెలల నుండి జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్ గిరి హస్తగతమైంది .వైస్ చైర్మన్ గా ఉన్న షేక్ మున్న ఇన్చార్జి చైర్మన్ గా కొనసాగాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నెలలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశానికి షేక్ మున్న అధ్యక్షత వహించాల్సిందిగా ఉత్తర్వుల పేర్కొన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడు కూయకముందే బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకొని, మున్సిపాలిటీ వార్డుల సమస్యలను ఖర్చులపై చర్చించే అవకాశం కల్పించడంతో చైర్మన్ పదవి హస్త గతమైంది .. బి ఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత అన్యోన్యంగా నాటకీయ పరిణామాల మధ్య కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాగా గత కొన్ని నెలల నుండి చైర్మన్ పీఠం కోసం ఇరువర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేసిన విషయం విధితమే..