నవతెలంగాణ- వలిగొండ రూరల్ : ఈ నెల 30 వ తేదీన జరుగనున్న అసంబ్లీ ఎన్నికల్లో భువనగిరి బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి ఫైళ్ల వనిత అన్నారు.శనివారం మండలంలోని అరూర్,జంగారెడ్డిపల్లె గ్రామాలలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి తోపాటు శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇంకా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు చిట్టెడి జయమ్మ జనార్దన్ రెడ్డి, శివరాత్రి ఎల్లమ్మ, చిట్టెడి వెంకట్ రాం రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి,పనుమటి మమత,మర్రి వెంకటేశం,బాల్ శంకర్,జక్కిడి శ్రీనివాస్ రెడ్డి, జినుకల దానయ్య,బండ నరేష్, శ్రీనివాస్, శివరారాత్రి నర్సింహ, వేణు, నరేందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.