నవతెలంగాణ- చిట్యాల టౌన్: బీజేపీ రాష్ట్ర నాయకులు, చిట్యాల మాజీ జెడ్పిటిసి, ఒకటో వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ తన అనుచరులతో బుధవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుండి చిరుమర్తి లింగయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, ఉప్పల వెంకట్ రెడ్డి దితరులు పాల్గొన్నారు.