– రంజీ ట్రోఫీ పైమధ్యప్రదేశ్ పట్టు
నాగ్‌పూర్: మధ్యప్రదేశ్, విదర్భ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో హిమాన్షు మంత్రి (126, 265 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) వన్‌మ్యాన్ షోతో అదరగొట్టాడు. యశ్ దూబె (1), హర్ష్ (25), శుభమ్ (1), వెంకటేశ్ అయ్యర్ (0) విఫలమైనా ఓ ఎండ్‌లో నిలబడిన హిమాన్షు బాధ్యతాయుత సెంచరీతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సాగర్ సోలంకి (26), జైన్ (30)లు హిమాన్షుకు సహకారం అందించారు. హిమాన్షు సెంచరీతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 94.3 ఓవర్లలో 252 పరుగులు చేసింది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు కుప్పకూలగా.. మధ్యప్రదేశ్ 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 13/1తో పోరాడుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో మరో 69 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.