లాయిడ్స్‌ టెక్నలాజీ సీఈఓగా శిరీష్‌ ఓరుగంటి

హైదరాబాద్‌ : బ్రిటన్‌కు చెందిన చెందిన ప్రముఖ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ గ్రూపుల్లో ఒకటైన లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తన కొత్త లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శిరీష ఓరుగంటిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఐటి రంగంలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఇంతక్రితం జెసిపెన్నీలో ఎండి, బోర్డు మెంబర్‌గా ఉన్న శిరీష లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌లో చేరారు. భారతదేశంలో జెపి మోర్గాన్‌ చేజ్‌ ఇన్‌ టెక్నాలజీకి మొదటి మహిళా మేనేజింగ్‌ డైరెక్టర్‌, మాస్టర్‌ కార్డ్‌ కోసం ఆర్కిటెక్చర్‌ డేటా, షేర్డ్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఏడాది చివర్లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో లీడర్‌ షిప్‌ టీమ్‌కు ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయి.