ఉద్యమకారులను ముట్టుకుంటే  కేసీఆర్ కు శంకరగిరి మాణ్యాలే:  శివసేన హెచ్చరిక

నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ ఉద్యమకారులను అణిచాలని చూసిన, ఉద్యమకారులను కుట్రలు చేసి, శాసన మండలికి పోవడానికి అడ్డుకోవడం కేసీఆర్ కుట్రలు చేసి కోదండరామ్కు అన్యాయం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ఉద్యమకారులను ముట్టుకుంటే శంకరగిరి మాణ్యాలు తప్పవని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు మద్దతుగా ‘దీక్ష’లో ఉద్యమకారులందరిని ఉద్దేశించి మాట్లాడారు. నాడు ఉద్యమకారులను కాదని ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్సీలుగా మంత్రులను చేసిన పాపం చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు. మీ ఆటలు ఇక నుండి సాగవని తెలిపారు.  ఉద్యమద్రోహులకు పదవులు కేటాయించిన కేసీఆర్ కు ఆ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. కోదండరామును శాసనమండలిలో ప్రమాణం చేయకుండా ఆపడం ఎవరి తరం కాదని పూస శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊదరి బాలమల్లేష్, గుండెబోయిన పవన్ కళ్యాణ్, నరేష్, పృద్విరామ్, రాఖేష్, పాల్గొన్నారు.