భాద్యతలు చేపట్టిన నూతన ఏఓ శివ

Shiva is the new AO who took chargeనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడ్డ డోంగ్లి కొత్త మండలానికి కొత్తగా ఆ మండల వ్యవసాయ అధికారిగా శివ బాధ్యతలు చేపట్టారు. కొత్త మండలానికి కొత్త ఏవో రావడం డోంగ్లి మండల రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మొట్టమొదటిసారి డోంగ్లి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి వచ్చిన కొత్త ఏవో శివ కు పలువురు నాయకులు అధికారులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో డోంగ్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ అశోక్ పటేల్, సింగిల్ విండో ఉన్నతాధికారితో పాటు సింగిల్ విండో సిబ్బంది పాల్గొన్నారు. సన్మానించిన వారికి కొత్త ఏఓ శివ ధన్యవాదాలు తెలిపారు.