భోగేశ్వర ఆలయంలో శివ మహా పడిపూజ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి గ్రామంలోని భోగేశ్వరాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శివ మహా పడిపూజ కార్యక్రమానికి మండల కేంద్రంలోని భక్తులతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల్లో శివమాల వేసుకున్న భక్తులందరూ పెద్ద ఎత్తున తల్లి రావాలని శివసేవ సమితి గాంధారి తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు గణపతి పూజ అమ్మవారి పూజ మహాదేవుని అభిషేకం తదితర కార్యక్రమాలతో ముగుస్తుందని శివసేవ సమితి సభ్యులు తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండల కేంద్రంలోని భక్తులతో పాటు వివిధ గ్రామాల్లోని భక్తులు సైతం భారీ ఎత్తున రావాలని సమితి సభ్యులు కోరడం జరిగింది. కార్యక్రమంలో శివ సేవా సమితి సభ్యులు వెంకన్న గురు శివ, కృష్ణ గౌడ్ గురు శివ, సంజు శివ, జాన్ శివ, రవి శివ, చంటి శివ తదితరులు పాల్గొన్నారు