భిన్న కాన్సెప్ట్‌తో ‘శివ శంభో’

'Shiva Shambho' with a different conceptఅనంత ఆర్ట్స్‌ పతాకంపై నర్సింగ్‌ రావు దర్శకత్వంలో రాజగోపాల్‌, దోరవేటి సుగుణ నిర్మిస్తున్న చిత్రం ‘శివ శంభో’. తనికెళ్ల భరణి, సుమన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం సమక్షంలో గాయకుడు, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న విడుదల చేశారు. ఈ చిత్రంతో పరిచయం అవుతున్న హీరో కష్ణ ఇస్లావత్‌, హీరోయిన్‌ కేశవర్థిని, బేబీ రిషిత తదితరులు ఇందులో ఇతర కీలక పాత్రలను పోషించారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ, ‘పోస్టర్‌ చూస్తుంటే తెలుగు సాహిత్యం, సంస్కతితో పాటు అన్ని హంగులతో ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. మంచి కాన్సెప్ట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది’ అని చెప్పారు. ‘మహా శివరాత్రికి సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శకుడు నర్సింగ్‌రావు తెలిపారు. మాటలు, పాటల రచయిత దోరవేటి మాట్లాడుతూ,’ఈనాటి సమాజానికి డబ్బు, సుఖాలు, సౌకర్యాలకు కొరత లేదు. కానీ మనశ్శాంతి లేక కొట్టుకుంటున్నారు. పరమ శివుని నమ్ముకుంటేనే శాంతి దొరుకుతుందనే సందేశంతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.