శివాలయ పునర్నిర్మాణ కమిటీ సమావేశం

నవతెలంగాణ- వలిగొండ రూరల్

మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో శివాలయ పునర్నిర్మాణ కమిటీ సమావేశం సోమవారం బొడ్డు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్ మల్లం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలోని పురాతన శివాలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి 50 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, దేవాలయ పునర్నిర్మాణానికి గ్రామ ప్రజలంతా భాగస్వామ్యం కావాలని వారన్నారు. శివాలయ పునర్నిర్మానంతో పాటు దేవాలయంలో కళ్యాణ మండపం, ప్రహరి గోడ నిర్మాణం తదితర అభివృద్ధి పనుల కోసం గ్రామంలోని అన్ని కులాల నుండి సభ్యులతో ఒక కమిటీని ఎన్నుకోవడానికి సమావేశం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కమిటీలో సభ్యులు దేవాలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో సిట్టోజు వెంకట్ నారాయణ చారి, నరసింహ చారి, గంజి రామకృష్ణ, శీలోజు అంజయ్య, బూడిద బిక్షమయ్య, బూడిద ఈదయ్య, మల్లం సాలయ్య, గంజి అశోక్, ఆలకుంట్ల కృష్ణ, బోదాసు దుర్గయ్య, బైరు సైదులు గౌడ్, ఎడవెల్లి నరసింహ, దుడ్డు రమేష్, మారబోయిన అంజయ్య, చెవ్వ మధు, వినీత్ గౌడ్, మహేందర్ గౌడ్, ఉపేందర్, బొజ్జ కిష్టయ్య, అశోక్ ముదిరాజ్, పిట్టల గణేష్, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు.