గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ‘శివం భజే’ చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. పాటలు, ట్రైలర్, ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్‌లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నారు. న్యూ ఏజ్ కథ-కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోయే ఈ చిత్రంలో వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు హైలైట్ అవ్వనున్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్, ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ, డీ ఓ పి: దాశరథి శివేంద్ర, దర్శకత్వం : అప్సర్, నిర్మాత : మహేశ్వర రెడ్డి మూలి.