అంచనాలు పెంచిన శివం భజే టీజర్‌

అంచనాలు పెంచిన శివం భజే టీజర్‌గంగా ఎంటర్టైన్మంట్స్‌ మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘శివం భజే’. ఇప్పటికే టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో అందరి దష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్‌ నేడు విడుదలై అమాంతం అంచనాలను పెంచేసింది. అప్సర్‌ దర్శకత్వంలో న్యూ ఏజ్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్‌, యాక్షన్‌, థ్రిల్‌ ఎలిమెంట్స్‌తో పాటు డివోషన్‌ కూడా ఉన్నట్టు టీజర్‌లో తెలుస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కొత్త కథ, కథనాలకి తగ్గట్టుగా నటులు, సాంకేతిక విలువలు సమకూర్చు కున్నాం. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌కి మించిన స్పందన ఇప్పుడు టీజర్‌కి రావడం చాలా ధైర్యన్నిస్తుంది. మా హీరో అశ్విన్‌ బాబు, దర్శకుడు అప్సర్‌ కూడా ఈ చిత్ర విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అర్బాజ్‌ ఖాన్‌, సాయి ధీనా, హైపర్‌ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర నిర్మాణాంతర కర్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకుని జూలైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం’ అని తెలిపారు.
”శివం భజే’ టైటిల్‌తోనే అందరి దష్టి ఆకర్షించిన మా చిత్ర టీజర్‌కి అన్ని భాషల ప్రేక్షకులు, వీక్షకుల నుండి అనూహ్యమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మా నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది’ అని దర్శకుడు అప్సర్‌ చెప్పారు.
హీరో అశ్విన్‌ బాబు మాట్లాడుతూ, ‘టీజర్‌కి వస్తున్న అనూహ్య స్పందనకి అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా సస్పెన్స్‌, కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌తో పాటు డివోషన్‌ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. మా దర్శకుడు అప్సర్‌, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం’ అని అన్నారు.