అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్‌ను మేకర్స్ సోమవారం ప్రకటించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.1 గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘శివం భజే’ అని టైటిల్ పెట్టడం ఇప్పుడు అందరి దష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ‘కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ విలన్ సాయి ధీనా, హైపర్ ఆది ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే 80% చిత్రీకరణ పూర్తి చేసుకుని భారీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాం’ అని తెలిపారు. ‘మా కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘శివం భజే’ దొరకడం చాలా సంతోషంగా ఉంది’ అని దర్శకుడు అప్సర్ అన్నారు.