అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకుడు. ఇటీవల విడుదలైన టైటిల్ ‘శివం భజే’ అందరి దష్టిని ఆకర్షించగా, శుక్రవారం చిత్రం నుండి హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,’ఒక వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి లాంటి నటులు మా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దాశరథి శివేంద్ర అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తవడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యప్తంగా జూన్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని తెలిపారు. ‘మా టైటిల్‌కి మించిన స్పందన ఫస్ట్ లుక్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరి సహకారంతో అంచనాలకి మించి చిత్రం రూపొందింది. ఇది తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని దర్శకుడు అప్సర్ చెప్పారు.