
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంటలో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మూడవరోజు శనివారం అగ్గి గుండములు, రుద్రాభిషేకాన్ని జంగం ప్రభాకర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలో మూడు రోజులు శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండగ ప్రశాంతంగా నిర్వహించారు. మండలంలోని పోసానిపేట శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, అన్నారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం రాత్రి మద్దికుంట ఆలయ పరిసరాల్లో సందర్శకుల జాగారణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోజారి లచ్చిరెడ్డి, ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, అవినాష్ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.